అన్ని రకాల సీజనల్ వ్యాధులకు కారకాలైన దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు... దోమల నియంత్రణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిముషాల కార్యక్రమంలో భాగంగా... హైదరాబాద్‌లోని తన నివాస ప్రాంగణంలో నీటి నిల్వలను తొలగించారు. పూలతొట్టిలు, ఇతర ప్రాంతాల్లో వర్షపు నీటిని మంత్రి పారబోశారు.
దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
దోమల నియంత్రణ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఇంటి పరిసరాల్లోని నీటి నిల్వలను తొలగించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ దోమల నివారణకు కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
'దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'