దళారుల ప్రమేయం లేకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా ఉద్యోగులు కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని... త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన ఉద్యోగులందరికీ ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. ఉద్యమస్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులంతా భాగస్వామ్యం కావాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.
'రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలి' - MINISTER SRINIVAS GOUD ON TNGO EMPLOYEES
రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులందరూ.... భాగస్వామ్యం కావాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
MINISTER SRINIVAS GOUD ON TNGO EMPLOYEES