తెలంగాణ

telangana

రియల్​ ఎస్టేట్​ పడిపోతుందన్నారు: శ్రీనివాస్​ గౌడ్​

By

Published : Dec 27, 2019, 7:50 AM IST

తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందని కొంతమంది అపోహలు కలిపించారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. కానీ వాటిని పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పరిపాలనను అందిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్​లోని శిల్పకళా వేదికలో ఓ రియల్​ ఎస్టేట్​ సంస్థ బ్రోచర్​ను మంత్రి ఆవిష్కరించారు.

minister srinivas goud on real estate in Hyderabad
రియల్​ ఎస్టేట్​ పడిపోతుందన్నారు: శ్రీనివాస్​ గౌడ్​

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్​లోని శిల్పకళా వేదికలో ఓ రియల్​ ఎస్టేట్​ సంస్థ బ్రోచర్​ను మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందని కొంతమంది అపోహలు కలిపించారని... కానీ వాటిని పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పరిపాలనను అందిస్తున్నారని తెలిపారు.

1500 కోట్లతో యాదాద్రి టెంపుల్

1500 కోట్లతో యాదాద్రి టెంపుల్ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. కరెంటు, నీటి సమస్యలు లేవని, రైతులు వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వీ. సింధు, వాలీబాల్ ప్లేయర్ శ్వేతా రెడ్డి పాల్గొన్నారు.

రియల్​ ఎస్టేట్​ పడిపోతుందన్నారు: శ్రీనివాస్​ గౌడ్​

ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details