తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసీలు అన్ని రంగాల్లో మెరుగవ్వాలి - world triabal welfare day latest news

ఆదివాసీల అభివృద్ది కోసం ఎల్లవేళలా కృషి చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాసబ్​ట్యాంక్​లోని గిరిజన మ్యూజియంను సందర్శించారు.

minister-satyavathi-said-tribals-need-to-improve-in-all-areas
ఆదివాసీలు అన్ని రంగాల్లో మెరుగవ్వాలి

By

Published : Aug 9, 2020, 4:18 PM IST

ఆదివాసీలు అన్ని రంగాల్లో మెరుగవ్వాలి

ఆదివాసీలు మరింత ఆర్థికంగా మెరుగవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ అన్నారు. విద్య, ఉద్యోగాల విషయంలో ఆదివాసీలకు సహాకారం అందిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్​ చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌లో సందర్శన ఏర్పాటు చేశారు.

గిరిజన మ్యూజియంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టియానా, గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి మంత్రి సత్యవతి రాఠోడ్‌ పర్యటించారు. ఆదివాసీలకు సంబంధించిన పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

గతంలో గిరిజన సంక్షేమ శాఖలో తాను పనిచేశానని.. మళ్లీ ఇప్పుడు ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ తెలిపారు. గిరిజన మ్యూజియం సందర్శించిన సందర్భంగా పాత మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని సీఎస్ తెలిపారు.

ఇదీ చూడండి :కాంగ్రెస్​ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు

ABOUT THE AUTHOR

...view details