తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం' - తెలంగాణ వార్తలు

Satyavathi Rathod about Welfare schemes : రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి సత్యవతి తెలిపారు. ఇటువంటి పథకాలు ఎక్కడా లేవని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

Satyavathi Rathod about Welfare schemes , trs ministers
తెలంగాణలోని పథకాలు దేశంలో ఎక్కడా లేవు: సత్యవతి రాఠోడ్‌

By

Published : Mar 4, 2022, 11:56 AM IST

Updated : Mar 4, 2022, 1:34 PM IST

Satyavathi Rathod about Welfare schemes : రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 6,7,8 తేదీల్లో మహిళా బంధు - కేసీఆర్ పేరిట సంబురాలు జరపనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెరాస ఎల్పీ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు.

Sabitha about Welfare schemes : తెలంగాణ రాష్ట్రంలో బాలిక పుడితే రూ.13 వేలు అందజేస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పాలు, గుడ్లు ఇస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌తో పదిలక్షల కుటుంబాలకు మేలు జరిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా సుమారు 11 లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు. మహిళల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయని వివరించారు.

ప్రసవం తర్వాత మహిళకు కడుపునిండా భోజనం, సరైన మందులు ఇస్తున్నాం. ఈ నేపథ్యంలో మాతా-శిశు మరణాలు తగ్గాయి. అంతేకాకుండా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

-సత్యవతి రాఠోడ్, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి

షీ టీమ్స్, భరోసా కేంద్రాలు మహిళల కోసం ఏర్పాటు చేశాం. ఈ విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. మహిళలు ఏ చిన్న ఇబ్బంది కలిగినా... షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఉన్నాయని ధైర్యంగా ఉన్నారు. మహిళా సంఘాల ద్వారా చిన్న చిన్న అవుట్ లెట్లు ఏర్పాటు చేసి... ప్రతి గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేసుకునేలా సదుపాయం కల్పించాం. మహిళలు వ్యాపారదిశగామళ్లేలా ప్రోత్సాహం ఇస్తున్నాం.

-సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

'మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం'

ఇదీ చదవండి:Mirchi prices in Enumamula market : ఎర్రబంగారం రికార్డు ధర.. క్వింటా@ రూ.32 వేలు

Last Updated : Mar 4, 2022, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details