సమాజంలో మార్పు రావాలంటే ఆడ పిల్లలకు విద్య అత్యంత ఆవశ్యకమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అపోలో గ్రూప్ ఆధ్వర్యంలో ఇండియాస్ టీన్ స్పిరిట్ పేరుతో బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర ఆడిటోరియంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యాక్రమంలో ఆమె పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన పలువురికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా కొవిడ్ సమయంలో తమ శక్తికి మించి పని చేసిన వారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఏ రంగంలోనైనా మార్పు రావాలంటే విద్య అత్యంత ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. బాలికలు విద్యావంతులైతే వారితో పాటు వారి కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్లే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. వారికోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.