కొవిడ్ బారిన పడిన చిన్నారుల చికిత్సకు ఎలాంటి లోటు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. హైదరాబాద్‌లోని శిశువిహార్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన పిల్లలకు మెరుగైన చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రులు, శిశుకేంద్రాలకు తరలించాలని సూచించారు. అందుకోసం అన్ని జిల్లాల్లోను ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
'కొవిడ్ బారిన పడిన చిన్నారుల కోసం ప్రత్యేక వసతి' - మంత్రి సత్యవతి రాఠోడ్ తాజా వార్తలు
కొవిడ్ బారిన పడిన చిన్నారుల చికిత్స కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని శిశువిహార్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు.
శిశువిహార్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
చిన్నారుల సంరక్షణ కోసం ఇటీవల ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్‌లైన్ డెస్క్‌కు వెళ్లి సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. పిల్లలకు మెడికల్ కిట్ అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు ఆదేశించారు. శిశు విహార్‌లోని ప్రతి వార్డులో తిరిగి పరిస్థితులను సమీక్షించారు. చిన్నారులకు అందిస్తున్న ఆహారం, స్టాక్రూంలను పరిశీలించారు.
ఇదీ చూడండి:ఐసోలేషన్ కేంద్రంలో 11 మంది మృతి