తెలంగాణ

telangana

ETV Bharat / state

Satyavathi Rathod On BJP, Congress: 'తెలంగాణపై విషం చిమ్మడమే వారి పని'

Satyavathi Rathod On BJP, Congress: పార్లమెంట్‌లో సాగుతున్న ప్రశ్నలు సమాధానాలు చూస్తుంటే కాంగ్రెస్‌, భాజపా రెండు ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని గిరిజన, సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ ఆరోపించారు.

Satyavathi
Satyavathi

By

Published : Apr 3, 2022, 3:12 PM IST

'తెలంగాణపై విషం చిమ్మడమే వారి పని'

Satyavathi Rathod On BJP, Congress: భాజపా-కాంగ్రెస్ నేతలు తెలంగాణపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని గిరిజన, సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ ధ్వజమెత్తారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. పార్లమెంట్‌లో సాగుతున్న ప్రశ్నలు సమాధానాలు చూస్తుంటే కాంగ్రెస్‌, భాజపా రెండు ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తెరాస శాసనసభాపక్ష సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాఠోడ్ మాట్లాడారు.

కేంద్రమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సత్యవతి స్పష్టం చేశారు. అంగన్‌వాడీకి వచ్చే గోధుమలు స్టాక్ కూడా కేంద్రం ఇవ్వడంలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏప్రిల్‌ నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే శుభవార్త వింటారని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. స్మృతి ఇరానీ బహిరంగ క్షమాపణ చెప్పాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్‌ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని తెలిపారు. కేంద్రానికి అనేక అంశాలపై తీర్మానాలు చేసి పంపినా ఉలుకులేదు పలుకులేదని ఆక్షేపించారు.

అంగన్​వాడీలకు గోధుమలు ఇవ్వడం లేదనేది అవాస్తవం. పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అబద్ధాలు చెప్పారు. పార్లమెంట్‌లో సాగుతున్న ప్రశ్నలు సమాధానాలు చూస్తుంటే కాంగ్రెస్‌, భాజపా రెండు ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అన్ని వర్గాలకు తెరాస ప్రభుత్వం న్యాయం చేస్తోంది.

-- సత్యవతి రాఠోడ్, మంత్రి

ఇదీ చదవండి:పబ్​పై పోలీసుల దాడులు.. అదుపులో ప్రముఖ సింగర్​, నటులు

ABOUT THE AUTHOR

...view details