రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విపత్కర కాలంలో ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. ప్రార్థనల ద్వారా వైరస్ అంతమొందాలని ఆకాంక్షించారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాలు, మతాల పండుగలు గొప్పగా జరుగుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు.
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు: మంత్రి సత్యవతి - తెలంగాణ వార్తలు
రంజాన్ పండుగ వేళ ముస్లింలకు మంత్రి సత్యవతి రాఠోడ్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఇళ్లలోనే పండుగ జరుపుకోవాలని సూచించారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్రంలో వివిధ పథకాలు ప్రవేశపెట్టినట్లు మంత్రి గుర్తు చేశారు.
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి రాఠోడ్. మంత్రి సత్యవతి
దాదాపు 4 లక్షల పేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో షాదీఖానాల నిర్మాణం, మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. మైనారిటీ విద్యార్థుల కోసం 206 ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెరాసదేనన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై కరోనా ప్రభావం