తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం... శాశ్వత పరిష్కారం చూపిస్తాం'

వరద బాధితులకు అండగా ఉంటామని... నష్టపోయిన వాళ్లందరికీ రూ.10 వేలు సాయం అందజేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఎవరికైనా సహాయం అందకపోతే... అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

minister Sabitha Indra Reddy financial assistance to flood effectives at badgumpet in Hyderabad
'ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం... శాశ్వత పరిష్కారం చూపిస్తాం'

By

Published : Oct 23, 2020, 8:56 AM IST

హైదరాబాద్ బడంగ్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని... బాలాపూర్​లోని సీపీఎన్​ఆర్ లేఅవుట్ 13,15 డివిజన్​లలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. లిబ్రా కాలనీలలో ముంపునకు గురైన వారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు ఆర్థిక సహాయాన్ని అందించారు.

సుమారు 200 కుటుంబాలకు పదివేల రూపాయల చొప్పున సాయం అందించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని... అధైర్యపడవద్దని తెలిపారు. బాలాపూర్ మండల పరిధిలో ఉన్న చెరువులన్నింటికీ ఎఫ్​టీఎల్ గుర్తించి, చెరువులను అనుసంధానం చేసి శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పనిచేసిన స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను మంత్రి అభినందించారు.

ఇదీ చూడండి:వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత

ABOUT THE AUTHOR

...view details