బ్యాంకు ఖాతాల వివరాలు అందజేసిన కర్షకులకు రైతుబంధు(RYTHU BANDHU) సొమ్ము జమ చేయడం పూర్తయిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి(Agriculture Minister Niranjan Reddy) తెలిపారు. శుక్రవారం నాటికి మొత్తం 60.84 లక్షల మంది ఖాతాల్లో రూ.7,360 కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు.
RYTHU BANDHU: 60.84 లక్షల మంది ఖాతాల్లో రూ.7,360 కోట్లు జమ - రైతుబంధు సొమ్ము
కర్షకులకు రైతుబంధు సొమ్ము జమ చేసే కార్యక్రమం పూర్తి అయిందని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇంకా రైతులెవరైనా మిగిలిపోతే వారి బ్యాంకు ఖాతాల వివరాలను గ్రామల ఏఈవోలను అందించాలని సూచించారు.
RYTHU BANDHU: 60.84 లక్షల మంది ఖాతాల్లో రూ.7,360 కోట్లు జమ
రైతులకు మొత్తం కోటీ 47 లక్షల 21 వేల ఎకరాల భూములున్నాయని, ఎకరానికి రూ.5 వేలు జమచేశామని వివరించారు. ఇంకా రైతులెవరైనా మిగిలిపోతే వారి బ్యాంకు ఖాతాల వివరాలను గ్రామాల ఏఈవోలకు అందజేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం వేసిన సొమ్మును రైతులకు నగదు రూపంలో అందజేయాలని, పాత బాకీలకు జమచేసుకోవద్దని బ్యాంకులకు మంత్రి సూచించారు.
ఇదీ చూడండి:40 రూపాయల్లోనే మూడు పూటల ఆహారమా?