విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. టీఎస్ ఆగ్రోస్ సహకారంతో గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాలకు సేంద్రీయ మామిడిపండ్లను అందించేందు తీసుకువచ్చిన www.cropmandi.com వెబ్‌పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు.
'క్రాప్మండి' వెబ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రి - niranjan reddy_Launch_Web_Portal to buy fruits
కరోనా వల్ల ఏర్పడ్డ సంక్షోభ సమయంలో రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో టీఎస్ ఆగ్రోస్ సహకారంతో ప్రజలకు ఇంటి వద్దకే సేంద్రీయ మామిడిపండ్లను అందించేందుకు కొందరు ముందుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వెబ్‌పోర్టల్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు.
'క్రాప్మండి' వెబ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రి నిరంజన్
సంక్షోభ సమయంలో రైతులు పండించిన ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చేందుకు పోర్టల్ నిర్వాహకులు చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. మామిడి, బత్తాయి, బొప్పాయి, తదితర పండ్లను ప్రభుత్వ సంస్థలతో పాటు ఇతర సంస్థల సహకారంతో వినియోగదారుల ఇంటి వద్దకు చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.