తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాలు పాటించాలి: మంత్రి మల్లారెడ్డి - గాంధీ జయంతి వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి బోయిన్​పల్లిలోని తన నివాసం వద్ద మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరు వారి సిద్ధాంతాలను పాటించాలని తెలిపారు.

Minister Mallareddy tributes to Gandhi
ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాలు పాటించాలి: మంత్రి మల్లారెడ్డి

By

Published : Oct 2, 2020, 3:14 PM IST

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బోయిన్​పల్లిలోని తన నివాసం వద్ద మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అహింసాయుత మార్గంలో ప్రజలను చైతన్యపరిచి వారిలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహనీయుడుగా మహాత్మాగాంధీ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో ఆయన ఎంచుకున్న మార్గం ఎంతో గొప్పదని కొనియాడారు.

మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరు వారి సిద్ధాంతాలను పాటించాలని మల్లారెడ్డి తెలిపారు .ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి:గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

ABOUT THE AUTHOR

...view details