Patney Naala: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్యాట్నీ నాలా అభివృద్ధి శంకుస్థాపన పనులు ఈనెల 12న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని స్థానిక ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన, తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్యాట్నీ నాలా వద్ద నెలకొన్న పరిస్థితి పరిశీలించారు.
Patney Naala: ఈనెల 12న ప్యాట్నీ నాలా అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం
Patney Naala: సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా అభివృద్ధి శంకుస్థాపన పనులను ఈనెల 12న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇవాళ ప్యాట్నీ నాలా వద్ద పరిస్థితిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పరిశీలించారు.
గత ఏడాది భారీ వర్షాలకు నాలా వద్ద చెత్త చెదారం పేరుకుపోవడం వల్ల వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దృష్ట్యా మంత్రి కేటీఆర్ రూ. 10 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. వరదల మూలంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కేటీఆర్... ఇచ్చిన హామీ మేరకు ఈనెల 12న శంకుస్థాపన పనులు మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సాయన్న అన్నారు. రాబోయే వర్షాకాలం నాటికి నాలా అభివృద్ధి పనులు పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి:TRS Protest : ఇవాళ నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు