మారోమారు ట్విటర్లో స్పందించిన మంత్రి కేటీఆర్ షాద్‌నగర్ ఘటనపై మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్‌లో స్పందించారు. చట్టాలను సవరించాలని మోదీకి ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటనలో ఇప్పటివరకు దోషులకు ఉరిశిక్ష పడలేదని గుర్తు చేశారు. ఇటీవల 9నెలల చిన్నారిపై హత్యాచారం చేసిన వ్యక్తికి హైకోర్టు శిక్ష తగ్గించిందని, ఇలాంటి పరిస్థితుల్లో వైద్యురాలి కుటుంబానికి హమీ ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు.
చట్టాలను సవరించాలి...
ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయ పడ్డారు. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరగాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. నేరం రుజువైతే తీర్పుపై మళ్లీ సమీక్ష లేకుండా చూడాలని విన్నవించారు. న్యాయం ఆలస్యమైతే బాధితులకు అన్యాయం జరిగినట్లేనని తెలిపారు. ఐపీసీని సవరించేలా పార్లమెంటులో చట్టాలు చేయాలని, ఈ సమావేశాల్లోనే పూర్తి స్థాయిలో చర్చలు జరగాలని మోదీని ట్విట్టర్‌లో కేటీఆర్ కోరారు.
ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ సమావేశం