KTR Tweet on Youth Employment: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తెరాస ప్రభుత్వానికి యువత అండగా నిలబడాలని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కోరారు. ప్రభుత్వ రంగంలో శరవేగంగా ఉద్యోగాల భర్తీ, గ్రామీణ రంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పన చేస్తూ, మరోవైపు ప్రైవేటు రంగంలో వేలాది పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషిచేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
'ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తెరాసకి యువత అండగా నిలబడాలి' - యువతకు ఉద్యోగాలు
KTR Tweet on Youth Employment: ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా.. యువతకు ఉపాధి అనే అంశంపై ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తెరాస ప్రభుత్వానికి యువత అండగా నిలబడాలని కేటీఆర్ ట్విటర్‌లో కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో మునుగోడు యువతకు ఉపాధి అందించే సంకల్పంతో.. ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ దండు మల్కాపూర్‌లో 2019లోనే ప్రభుత్వం నెలకొల్పిందని మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. సుమారు 35 వేల మంది స్థానిక యువతకు ఉపాధినందించే ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కు కూడా వస్తోందన్నారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్‌మంట్ సెంటర్ కూడా శరవేగంగా నిర్మాణం అవుతుందని కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు.
ఇవీ చదవండి: