Ktr Tweet to PM Modi:మత ప్రబోధకుడిపై భాజపా నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రాయబారులను పిలిపించి ముస్లిం దేశాలు నిరసన లేఖలు అందించంతో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భాజపా నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించిన కేటీఆర్... భాజపా నేతల తీరు వల్ల అంతర్జాతీయ సమాజానికి దేశం క్షమాపణ చెప్పాల్సి వస్తుందన్నారు. క్షమాపణ చెప్పాల్సింది భాజపా తప్ప దేశం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. విద్వేషం వెదజల్లుతున్నందుకు తొలుత ప్రజలకు భాజపా క్షమాపణ చెప్పాలని ట్విటర్లో మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
మోదీ జీ... భాజపా నేతల వ్యాఖ్యలకు దేశమెందుకు క్షమాపణ చెప్పాలి?: కేటీఆర్ - మోదీకి కేటీఆర్ ట్వీట్
Ktr Tweet to PM Modi: ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భాజపా నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి? అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సింది భాజపా తప్ప దేశం కాదని స్పష్టం చేశారు.
Minister KTR Tweet on Pm Modi
భాజపా నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి? అంతర్జాతీయ సమాజానికి దేశం క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. క్షమాపణ చెప్పాల్సింది భాజపా తప్ప దేశం కాదు. విద్వేషం వెదజల్లుతున్నందుకు తొలుత ప్రజలకు భాజపా క్షమాపణ చెప్పాలి. - ట్విటర్లో మంత్రి కేటీఆర్
ఇవీ చదవండి: