గుజరాత్‌లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ట్విటర్ వేదికగా ఐటీ మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును మోడెమోక్రసీ అంటూ ఎద్దేవా చేశారు. గుజరాత్‌కు చెందిన, గుజరాత్ చేత, గుజరాత్ కోసం పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని విస్మరించారని గుర్తుచేసిన కేటీఆర్.. కేంద్రం చర్య సిగ్గుచేటు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్రంపై కేంద్రం వివక్ష విడనాడాలని చురకలు అంటించారు.
కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం చర్య సిగ్గుచేటు : మంత్రి కేటీఆర్ - telangana varthalu
లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్‌లో ఏర్పాటు చేయడంపై పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం చర్య సిగ్గుచేటు అంటూ కేటీఆర్ ట్విటర్ పేర్కొన్నారు.
అన్నింట్లో తెలంగాణకు అన్యాయమే:కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విటర్ వార్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగిస్తోందని మరోసారి రుజువైందని కేటీఆర్ ఇటీవల ట్వీట్ చేశారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం.. యథావిధిగా గుజరాత్‌కు తరలిపోయిందని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన సంప్రదాయ వైద్య కేంద్రం.. గుజరాత్‌కు తరలిపోవడం గురించి మండిపడుతూ గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్‌కు ఇటీవల రీట్వీట్ కూడా చేశారు.కేంద్రం 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు కేటాయిస్తే వాటిలో తెలంగాణకు సున్నా అని కేటీఆర్ అన్నారు. ఐఐఎస్ఈఆర్‌లు 2 కేటాయిస్తే అందులోనూ రాష్ట్రానికి ఏం లేదని మండిపడ్డారు. 16 ఐఐటీల్లో రాష్ట్ర ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఐడీలు 4, మెడికల్ కళాశాలలు 157ల్లోనూ తెలంగాణకు సున్నా అని, 84 నవోదాయల్లో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని ట్వీటారు. రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ హామీని విస్మరించారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
ఇవీ చదవండి: