KTR Tweet on demonetization: నోట్ల రద్దు అంశం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికను పేర్కొంటూ విష్ణువర్దన్‌రెడ్డి అనే వ్యక్తి చేసిన ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. నోట్ల రద్దు నిర్ణయం ఘోర వైఫల్యమని విమర్శించారు. ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దు నిర్ణయం తీవ్రంగా దెబ్బ తీసిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సగం సగం ఆలోచనల వల్ల 8 త్రైమాసికాలు మందగమానికి గురయ్యాయని కేటీఆర్ తెలిపారు. నోట్ల రద్దుకు తోడు 2020 లాక్డౌన్ వల్ల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలిందని మంత్రి అభిప్రాయపడ్డారు.
తీపి జ్ఞాపకం..: మంత్రి కేటీఆర్ చేసిన మరో ట్వీట్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. కేటీఆర్.. తనకు సంబంధించిన ఓ తీపి జ్ఞాపకాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 20 ఏళ్ల క్రితం తీసుకున్న తన ఫొటోను.. ప్రస్తుత ఫొటోతో జత చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. '20 ఇయర్స్ ఎగో.. అండ్ నౌ' అని ఆ ఫొటోకు క్యాప్టన్ పెట్టారు. ఈ ఫొటో చూసిన అభిమానులు ఎవర్గ్రీన్ యంగ్ లీడర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.