తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటేయకుండా ప్రశ్నించే, విమర్శించే హక్కు ఏ పౌరునికి లేదు' - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

ఓట్ల కోసం ఆచరణ సాధ్యంకాని హామీలతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్​ మండిపడ్డారు. ఓటేయకుండా ప్రశ్నించే, విమర్శించే హక్కు ఏ పౌరునికి లేదని ఆయన అన్నారు. ప్రతి పౌరుడు ఓటుతో తమ నిర్ణయాన్ని తెలియజేయాలన్నారు.

minister ktr spoke on voting in ghmc
'ఓటేయకుండా ప్రశ్నించే, విమర్శించే హక్కు ఏ పౌరునికి లేదు'

By

Published : Nov 22, 2020, 4:31 PM IST

నిర్ణయాత్మక ప్రభుత్వం కావాలో, విభజన రాజకీయాలు కావాలో హైదరాబాదీలు నిర్ణయించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో హైసియా ఆధ్వర్యంలో బ్రాండ్ ఇమేజ్ అంశంపై జరిగిన ఇంటరాక్టివ్ సెషన్​లో కేటీఆర్ పాల్గొన్నారు. ఓట్ల కోసం ఆచరణ సాధ్యంకాని హామీలతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, నగరంలో కమ్యునల్ హార్మోనీ దెబ్దతినేలా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సివిక్ సొసైటీ హైదరాబాద్​లో ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని కేటీఆర్ సూచించారు.

ఓటేయకుండా ప్రశ్నించే, విమర్శించే హక్కు ఏ పౌరునికి లేదని ఆయన అన్నారు. ఓటు ఎవరికైనా.. తమ నిర్ణయాన్ని ఓటు ద్వారా తెలియజెప్పాలని కేటీఆర్ అన్నారు. మీరు మరింత మందిని ఓటేసేందుకు ప్రోత్సహించేలా.. డిసెంబర్ ఒకటవ తేదీన ప్రతి ఒక్కరు ఓటేసి సెల్ఫీ తీసుకొని మరీ తనకు ట్యాగ్ చేయాలని సూచించారు.

'ఓటేయకుండా ప్రశ్నించే, విమర్శించే హక్కు ఏ పౌరునికి లేదు'

ఇవీ చూడండి:ప్రపంచంలోనే సురక్షితమైన నగరం హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details