హుస్సేన్‌సాగర్ చుట్టూ నైట్ బజార్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్(KTR on Urban Development) తెలిపారు. హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో రూ. 37కోట్లతో ట్యాంక్‌బండ్‌ను ఆధునీకరించినట్లు చెప్పారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సర్వీస్ రోడ్లను విస్తరిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా భాగ్యనగరంలో ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కరణ.. నగర అభివృద్ధికి చేపడుతున్న పనుల గురించి శాసనమండలిలో కేటీఆర్ వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా తాగునీటిపై రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలో 13.50 లక్షల నీటి కనెక్షన్లు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నాం. ఉచిత తాగునీటి సరఫరాతో 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా 37 లక్షల బుట్టలు పంపిణీ చేశాం. స్వచ్ఛ హైదరాబాద్‌లో మున్సిపాలిటీలు, పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎనలేనిది. -కేటీఆర్, ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి