తెలంగాణ

telangana

ETV Bharat / state

సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచి: కేటీఆర్

KTR SPEECH IN 2023 ASSEMBLY SESSIONS: తెలంగాణలో ఏ రంగాన్నీ విస్మరించకుండా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి రాష్ట్రం దిక్సూచిలా మారిందని వివరించారు. తెలంగాణలో కరెంట్‌ కష్టాలు.. తాగునీటి తిప్పలు లేవని స్పష్టం చేసిన ఆయన.. దేశం కడుపు నింపే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో చర్చ ముగియగా.. చర్చకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

minister ktr
minister ktr

By

Published : Feb 4, 2023, 1:47 PM IST

Updated : Feb 4, 2023, 3:52 PM IST

KTR SPEECH IN 2023 ASSEMBLY SESSIONS: తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి రాష్ట్రం దిక్సూచిలా మారిందని తెలిపారు. తెలంగాణలో ఏ రంగాన్నీ విస్మరించకుండా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చ ముగియడంతో ఈ మేరకు మంత్రి సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ.. దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిందని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కరెంట్‌ కష్టాలు.. తాగునీటి తిప్పులు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్‌ అధికారంలోకి రాకముందు విద్యుత్‌ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో ఓసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే దేశ ప్రజల చూపు కేసీఆర్‌ వైపు ఉంటుందన్న ఆయన.. రాష్ట్రంలో నిధుల వరద పారుతోందని.. నియమాకాల కల సాకారమవుతోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీల్లో 9 తెలంగాణలోనే ఉన్నాయని గుర్తు చేశారు. పల్లె పల్లెకు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్న కేటీఆర్​.. దేశంలోని వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని వివరించారు.

''దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉంది. తెలంగాణలో ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో కరెంట్‌ కష్టం లేదు.. తాగునీటి తిప్పులు లేవు. కేసీఆర్‌ అధికారంలోకి రాకముందు విద్యుత్‌ ఎలా ఉంది..ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలి. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేదు. రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది.. నియమాకాల కల సాకారం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే 9 తెలంగాణలో ఉన్నాయి. పల్లె పల్లెకు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది.''-మంత్రి కేటీఆర్

సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచి: కేటీఆర్

ఆ విషయంలో తెలంగాణ నంబర్​ వన్..: వ్యవసాయ రంగంలో విదేశీ పెట్టుబడిని ఆకర్షించడంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ వివరించారు. రైతుబంధు పథకం ద్వారా 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.65 వేల కోట్లు జమ చేశామని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సైతం రైతు బంధును ప్రశంసించిందన్నారు. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల ద్వారా 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.

ఇవీ చూడండి..

6న రాష్ట్ర బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన కేసీఆర్

అసెంబ్లీలో అదానీ ఇష్యూ.. బీఆర్​ఎస్​, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం

Last Updated : Feb 4, 2023, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details