ఓఆర్ఆర్ మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త
10:53 October 01
ఓఆర్ఆర్ మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త
భాగ్యనగరం చుట్టూ ఉన్న బాహ్యవలయ రహదారికి త్వరలో మహార్ధశ పట్టనుంది. 159 కి.మి. పొడవు ఉన్న రహదారిలో ప్రయాణికుల సౌకర్యార్థం వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బాహ్యవలయ రహదారిలో వాహనచోదకుల కోసం అత్యవసర సేవలు, ప్రజా వినియోగ వసతులు కల్పన అంశంపై నామినేటెడ్ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
159 కి.మీ. ఉన్న బాహ్య వలయ రహదారి మార్గంలో వసతుల కల్పనకు తీసుకున్న చర్యలు ప్రణాళికల దశలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఓఆర్ఆర్ మీద ఉన్న 19 ఇంటర్ ఛేంజ్లలో మొదటి 10 ఇంటర్ ఛేంజ్ల వద్ద పెట్రోల్ బంకులతో పాటు.. అమెరికా, ఇతర దేశాలలో ఉన్నట్టుగా ఫుడ్ కోర్టులతో పాటు.. హెచ్ఎండీఏకు ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. వీటన్నింటినీ ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో నెలకొల్పుతామని మంత్రి కేటీఆర్ వివరించారు.
ఇదీ చూడండి:Huzurabad Notification: హుజూరాబాద్ ఉపఎన్నికకు నేడే నోటిఫికేషన్ విడుదల