తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా నినాదం విశ్వనగరం.. ప్రతిపక్షాల నినాదం విద్వేష నగరం' - Ktr roadshow at ecil x roads

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈసీఐఎల్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ రోడ్​షో నిర్వహించారు. ఎంఐఎం, భాజపాపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి కోసం ప్రజలు మరోసారి తెరాకే పట్టం కట్టాలని సూచించారు.

'మా నినాదం విశ్వనగరం.. ప్రతిపక్షాల నినాదం విద్వేష నగరం'
'మా నినాదం విశ్వనగరం.. ప్రతిపక్షాల నినాదం విద్వేష నగరం'

By

Published : Nov 25, 2020, 7:32 PM IST

కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్లు హైదరాబాద్​కు డజన్ మంది వస్తున్నారని... వరదల సమయంలో ఒక్కరు కూడా రాలేదని మండిపడ్డారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. అప్పుడు రాని వారు ఇప్పుడు వరదలా వస్తున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈసీఐఎల్ చౌరస్తాలో మంత్రి రోడ్​షో నిర్వహించారు.

హైదరాబాద్​కు వరదలు వస్తే సాయం చేయండి అని కేంద్రాన్ని అడిగితే ఉలుకుపలుకు లేదు. కర్ణాటక, గుజరాత్​కు మాత్రం సాయం చేశారు. మన చెమట, రక్తం ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారు. దిల్లీ నుంచి వచ్చే టూరిస్టులు ఏం ఇవ్వరు... ఏం ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వమే ఇస్తుంది.

--- రోడ్​షోలో కేటీఆర్

ఎన్టీఆర్ సమాధి, పీవీ నర్సింహారావు సమాధిని పగులగొట్టమని ఒక పిచ్చోడు అంటాడు... మరొక పిచ్చోడు చలాన్లు కడుతామంటున్నాడు. ఇలాంటోళ్లకా మనం ఓట్లేసేది? భాజపా నేతలు నల్లధనం వెనక్కి తెస్తామన్నారు.. నల్ల చట్టాలు తెచ్చారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని కబుర్లు చెప్పారు. మేయర్‌ పీఠం ఎంఐఎంకు ఇస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు.

--- రోడ్​షోలో కేటీఆర్

కేంద్రమంత్రులు నగరానికి వచ్చేటపుడు రూ. 1,350 కోట్లు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ను నమ్మే పరిస్థితిని లేదన్నారు. చలాన్లు కడతామన్న వ్యక్తే మోటారు వాహన చట్టానికి ఓటేశారని ఆ విషయం అయనకు కూడా తెలియదన్నారు.

ఇదీ చూడండి:అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details