తెలంగాణ

telangana

ETV Bharat / state

మెడికల్​ షాపులకు వచ్చేవారి వివరాలు తీసుకోవాలి: కేటీఆర్​

కోవిడ్ లక్షణాలైన జ్వరం, దగ్గు తదితర సమస్యలతో బాధపడుతోన్న వారు.. జ్వరం, ఇతర మెడిసిన్ కావాలంటూ మెడికల్ షాపులకు రావటం తమ దృష్టికి వచ్చిందని ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇలాంటి వారి నుంచి వివరాలు సేకరించేలా సూచనలు చేయాలని అధికారులను ఆదేశించారు.

minister ktr on corona symptoms patients in telangana
మెడికల్​ షాపునకు వచ్చేవారి వివరాలు తీసుకోవాలి: కేటీఆర్​

By

Published : Apr 18, 2020, 7:22 PM IST

జ్వరం, దగ్గు, జలుబు కోసం మెడికల్​ షాపుల్లోకి మందుల కోసం వస్తున్నట్లు తమకు తెలిసిందని ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇలాంటి కేసులను పర్యవేక్షిస్తామని, లక్షాణాలను బట్టి పరీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. మెడికల్ షాపులు, వాటి సంఘాలతో సమావేశం కావాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఫోన్ నంబర్, చిరునామా తదితర వివరాలను సేకరించేలా మెడికల్ షాపుల వారికి సూచనలు చేయాలని వెల్లడించారు. వివరాలు తీసుకునేప్పుడు దాని వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియజేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం

ABOUT THE AUTHOR

...view details