తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర విభజన జరిగి రెండుగా విడిపోయి ఉండవచ్చు.. కానీ' - ts news

KTR on Affection Between Telugu states: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి నిన్న వెళ్లినట్లు.. ఏపీ నుంచి వచ్చిన సోదరుల ప్రేమతో పొంగిపోయా అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర విభజన జరిగి రెండుగా విడిపోయి ఉండవచ్చు.. కానీ తెలంగాణ, ఏపీ మధ్య వ్యక్తిగతంగా ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయని అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

'రాష్ట్ర విభజన జరిగి రెండుగా విడిపోయి ఉండవచ్చు.. కానీ'
'రాష్ట్ర విభజన జరిగి రెండుగా విడిపోయి ఉండవచ్చు.. కానీ'

By

Published : Feb 12, 2022, 3:16 PM IST

KTR on Affection Between Telugu states: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ... ఇరు ప్రాంతాల మధ్య ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఉంటాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి వెళ్లినప్పుడు.. అక్కడ ఏపీ సోదరుల ప్రేమతో ఉప్పొంగియానంటూ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ కుమారుడి పెళ్లి వేడుకల దృశ్యాలను ట్విట్టర్​లో పోస్టు చేశారు.

"రాష్ట్ర విభజన జరిగి రెండుగా విడిపోయి ఉండవచ్చు. తెలంగాణ, ఏపీ మధ్య వ్యక్తిగతంగా ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి" - కేటీఆర్‌ ట్వీట్‌

బొత్స కుమారుడు సందీప్‌ వివాహం వ్యాపారవేత్త కదిరి బాలకృష్ణ కుమార్తె పూజితతో శుక్రవారం జరిగింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్‌ దంపతులు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తదితర ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details