KTR Letter To Central Minister: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేది రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి దక్కిన హామీ అని... బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. నిండు పార్లమెంట్లో భారత ప్రభుత్వం ఒప్పుకున్న నిర్ణయాన్ని నరేంద్ర మోదీ సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు. న్యాయంగా దక్కాల్సిన ఎన్నో విభజన హామీలను పక్కన పెట్టినట్టుగానే బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా భాజపా ప్రభుత్వం కావాలని పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
ప్రధానిని కలిసినా నిష్ప్రయోజనం...
సూమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల అపార ఇనుప ఖనిజ నిల్వలు బయ్యారంలో ఉన్నాయన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నివేదికను లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. నాణ్యమైన ఐరన్ ఓర్ బయ్యారంలో లేదని కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ఒకవేళ బయ్యారంలో సరిపడా నాణ్యమైన నిల్వలు లేకపోవడమే కారణం అయినా... కేవలం 180 కిలోమీటర్ల స్వల్ప దూరంలోని ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లలో గనులు కేటాయించాలని కోరిన విషయాన్ని కేటీఆర్ తెలిపారు. అక్కడి నుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ రవాణా చేసేందుకు ఒక స్లర్రి పైపులైన్ లేదా రైల్వే లైన్ వేస్తే సరిపోతుందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేశారని వెల్లడించారు.
కక్ష్యపూరిత ధోరణి...
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న ఐరన్ ఓర్ గనుల నుంచి బయ్యారం ప్లాంట్‌కు సరఫరా చేసేందుకు 2016లోనే ఎన్‌యండీసీ అంగీకరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేసిన కేటీఆర్... మెటలర్జికల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ (మేకాన్) సంస్థ ఖమ్మం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసి పెల్లెటైజేషన్ ప్లాంట్, స్ర్కాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అంశాలపైన సానుకూల నివేదిక ఇచ్చిందన్నారు. ఎన్‌యండీసీ, సింగరేణి కాలరీస్, రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు సానుకూలంగా స్పందించినా కేంద్రం మాత్రం బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటుపైన నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ల నిర్మాణాల కోసం కేంద్రం, ఎన్ఎండీసీ, స్థానిక ప్రభుత్వాలతో స్పెషల్ పర్పస్ వెహికల్ సంస్థలు ఏర్పాటైన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మోదీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందనడానికి ఇంతకంటే రుజువులు అవసరం లేదన్నారు.
ఒక్క రూపాయి కూడా ఇవ్వలే..