తెలంగాణ

telangana

ETV Bharat / state

Food Conclave: "త్వరలోనే తెలంగాణలో ఆక్వా యూనివర్సిటీ" - ktr latest speech

Food Conclave inaugurated by KTR: హైదరాబాద్​లో జరిగిన 2023 ఫుడ్​ కాంక్లేవ్​ను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. రాష్ట్రం దేశానికే ఫుడ్​ బౌల్​గా మారిందని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా యూనివర్సటీ తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఫుడ్​ ప్రొసెసింగ్​ యూనిట్లను ప్రారంభిస్తారని మంత్రి ప్రకటించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 29, 2023, 6:59 PM IST

Food Conclave inaugurated by KTR: నేడు దేశానికి తెలంగాణ రాష్ట్రం ఫుడ్‌ బౌల్‌గా మారిందని కేటిఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన 2023 ఫుడ్‌ కాంక్లేవ్‌ను మంత్రి కేటిఆర్‌ ప్రారంభించారు. ఈ మేరకు ప్రారంభ కార్యక్రమంలో ఆహార నాణ్యతపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో సహా, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, పశు సంవర్థక శాఖ తలసాని శ్రీనివాస యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగంలో వివిధ సంస్థలు, అంకురాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

త్వరలో ఆక్వా యూనివర్సిటీ: ఎన్విజనింగ్‌ ఇండియాస్‌ డెకేడ్‌ అన్న ఇతివృత్తంతో జరిగిన చర్చ గోష్ఠి అందరినీ ఆకట్టుకుంది. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు రోజంతా ఉత్సాహంగా చర్చ గోష్ఠిలో పాల్గొన్నారు. పింక్‌, వైట్‌, యెల్లో, బ్లూ, గ్రీన్‌ రెవల్యూషన్లపై.. ప్రస్తుతం రాష్ట్రం దృష్టి సారిస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో ఆక్వా యూనివర్సిటీని తీసుకురానున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో స్పెషల్‌ ఫుడ్‌ ప్రొసెసింగ్‌ యూనిట్లను ప్రారంభిస్తామని ప్రకటించారు.

న్యూట్రిషన్​ పెంచే విధంగా: ప్రజలకు ఆహారంలో సరైన పోషక విలువలు అందరికీ అందే విధంగా అంకుర సంస్థలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నాయి. న్యూట్రిషన్​లు పెంచే విధంగా అంకుర సంస్థను మొదలు పెట్టారని.. వారు తయారు చేసే ఆహారం ప్రత్యేకంగా మహిళలకు, చిన్న పిల్లలకు రసాయనాలు లేని మంచి ఫుడ్​ అందించాలనే తమ ఆశయం గా భావిస్తున్నట్లు సుకల్ప ఆర్గానిక్స్ వ్యవస్థాపకురాలు కల్పన చెప్పారు.

"తెలంగాణ ప్రస్తుతం దేశానికి ఫుడ్​ బౌల్​గా మారింది. రాష్ట్రంలో ఫుడ్​ ప్రొసెసింగ్​ కోసం ప్రత్యేక యూనివర్సిటీలను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. త్వరలోనే ఆక్వా యూనివర్సిటీని తీసుకువస్తాం. పశుసంవర్ధక శాఖలో రాష్ట్రంలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో ఫుడ్​కి సంబంధించిన సంస్థలు ఉన్నాయి. రాష్ట్రంలో ఫిషరీ, ఆక్వా, ఆర్టికల్చర్​ రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ వ్యక్తల పేర్ల మీద యూనివర్సిటీలు ఉన్నాయి. ఉదాహరణకు పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ.. తదితర ఉన్నాయి. ఇలాంటి వాటిలో నైపుణ్యం ఉన్న యువకులకు సరైనా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రత్యేకంగా ఫుడ్ ప్రొసెసింగ్​ యూనిట్ల కోసం 10 వేల ఎకరాల స్థలాన్ని కేటాయించాం."- కేటిఆర్‌, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి

ఫుడ్‌ కాంక్లేవ్​ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details