తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister KTR: హైదరాబాద్​లో పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నాం - hyderabad news

జీహెచ్​ఎంసీ పరిధిలో పేద ప్రజల కోసం ప్రభుత్వం లక్ష రెండు పడక గదుల నిర్మించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను విడతల వారీగా లబ్ధిదారులకు అందిస్తోంది. దీనిలో భాగంగా మంత్రి కేటీఆర్​ చంచల్​గూడలోని రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించి... పట్టాలను లబ్ధిదారులకు అందించారు.

Minister KTR
రెండు పడక గదుల ఇళ్లు

By

Published : Aug 28, 2021, 12:27 PM IST

హైదరాబాద్‌ చంచల్‌గూడలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఎంపీ ఒవైసీ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. విడతల వారీగా లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తామని వెల్లడించారు.

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధిపై సమీక్ష చేశాం. పాత, కొత్త నగరం తేడా లేకుండా అభివృద్ధి జరుగుతోంది. రెండు పడక గదుల ఇళ్లు, పైవంతెన నిర్మాణాలు పూర్తిచేశాం. రూ.30 లక్షలకుపైగా విలువైన ఇళ్లను ఉచితంగా ఇస్తున్నాం. నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాం. 34 ఎకరాల విస్తీర్ణంలో చంచల్‌గూడ జైలు ఉంది. చంచల్‌గూడ జైలును తరలించాలని ఎంపీ ఒవైసీ కోరుతున్నారు. జైలు తరలింపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాను.

-మంత్రి కేటీఆర్

రెండు పడక గదుల ఇళ్లు

ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు వెనుకాడదని మంత్రి వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్తది కట్టాలని స్థానిక నేతలు కోరినట్లు తెలిపారు. ఈ అంశం మీద కూడ చర్చిస్తామన్నారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో కేవలం 3 ఆస్పత్రులే కట్టారని... రెండేళ్లలో మేం 4 టిమ్స్‌లు నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ , జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:నెలాఖరు నుంచి గ్రేటర్‌లో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details