minister ktr in incubator startup challenge programme: ఓటమిని చూసి డీలాపడకూడదని.. మంత్రి కేటీఆర్ యువ వ్యాపారవేత్తలకు సూచించారు. ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్క్యుబేటర్ స్టార్ట్ అప్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఐ కేర్ రంగంలో కొత్త సాంకేతికతలను రూపొందించే ఉద్దేశంతో నిర్వహించిన ఇన్య్కుబేటర్ కార్యక్రమంలో 42 అంకురాలు పాల్గొనగా.. 12 అంకురాలు గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నాయి. మెుదటి మూడు స్థానాల్లో నిలిచిన అంకురాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సత్కరించారు. మెుదటి స్థానంలో నిలిచిన అంకుర వ్యవస్థాపకులకు 5 లక్షల రూపాయల నగదు బహుమానం అందించారు.
ఈ మేరకు యువ వ్యాపార వేత్తలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎకోసిస్టమ్‌ను యువ వ్యాపారవేత్తలందురూ వినియోగించుకోవాలని కోరారు. దేశంలో ఇంకా ఎంతో మంది ప్రజలు హెల్త్ కేర్ రంగంలో ఉన్న వసతులను అందుకోలేకపోతున్నారని అన్నారు. హెల్త్ కేర్ రంగంలో రోజు రోజుకు ఖర్చు పెరిగిపోతోందని..పేదలకు కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చేలా హెల్త్ కేర్ రంగంలో వసతులను తక్కువ ఖర్చు అయ్యేలా రూపొందించాలని కేటీఆర్ సూచించారు.
"కొత్త సాంకేతికత గురించి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ఎప్పుడూ ఒకటి గుర్తుచేసేవారు. సాంకేతికత సమాజంపై ఎంత ప్రభావం చూపిస్తుందని అడుగుతారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపిస్తుందా అని ప్రశ్నిస్తారు. కొత్త వ్యవస్థాపకులకు నేను రెండు విషయాలు చెబుతాను. ఒరిజినల్‌గా ఉండండి. కాపీ చేయొద్దు. అమెజాన్‌ను చూసి ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటివి సృష్టించవచ్చు. ఇది చాలా సులభం. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే సృష్టించినవి కావు. ప్రపంచ స్థాయికి చేరేలా కొత్త ఆవిష్కరణలు చేయండి. ఇప్పటికిప్పుడే వ్యవస్థాపకులుగా మారకపోవచ్చు. ప్రస్తుతం మూలధనం సమస్య కాదు. గతంలో మూలధనం సంపాదించాలంటే సవాల్‌గా ఉండేది. డబ్బును సమకూర్చుకుని ఆ తర్వాత ఆలోచనను అమలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆలోచనే ముఖ్యం. ఆ తర్వాతే మూలధనం. ఎంత తొందరగా మార్కెట్లోకి వస్తామనేదే ముఖ్యం. ఒరిజినల్‌గా ఉండండి. ఓటమి ఎదురైతే పండగ చేసుకోండి"_కేటీఆర్, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి
ప్రాంతీయ భాషలో సీఆర్పీఎఫ్: ప్రాంతీయ భాషలో సీఆర్పీఎఫ్ పరీక్షలు రాసేందుకు అనుమతించినందుకు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశాడు. 13 భాషల్లో రాసేందుకు అనుమతి ఇవ్వడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. దీని వల్ల తెలుగు రాష్ట్రాల నుంచి వేలమందికి లబ్ధి కలుగుతుందని కేటీఆర్ తెలిపారు.
'తెలంగాణలోని ఎకోసిస్టమ్‌ను వినియోగించుకోండి' ఇవీ చదవండి: