తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR on BJP leaders: 'దేశభక్తిపై ధ్రువీకరణ పత్రాలిచ్చేందుకు ఈ మూర్ఖులెవరు.?' - ktr tweet

అన్నదాతలను వీధిపాలు చేసిన వారు దేశ భక్తులు.. రైతులకు ఆపన్న హస్తం అందించిన వారు దేశ ద్రోహులా అని మంత్రి కేటీఆర్​(KTR on BJP leaders) ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​ దేశద్రోహి అన్న భాజపా నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​ స్పందించారు.

minister ktr, ktr fires on bjp leaders
మంత్రి కేటీఆర్​, భాజపా నేతలపై కేటీఆర్​ ఫైర్​

By

Published : Nov 22, 2021, 12:47 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశద్రోహి అన్న భాజపా నేతల వ్యాఖ్యలపై.. మంత్రి కేటీఆర్​(KTR fires on BJP leaders) తీవ్రంగా స్పందించారు. కొవిడ్ తీవ్రత, చలి ఉన్నప్పటికీ ఏడాదిపాటు రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా అని ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆ రైతులకు ఆపన్నహస్తం అందించినవారు ద్రోహులవుతారా అని కేటీఆర్ అడిగారు. దేశభక్తిపై ధ్రువీకరణపత్రం ఇచ్చేందుకు ఈ మూర్ఖులు ఎవరని మంత్రి మండిపడ్డారు.

కొవిడ్‌, చలిలో ఏడాదిగా రైతులను వీధిపాలు చేసినవారు దేశభక్తులా.?. ఇదే సమయంలో అన్నదాతలను ఆదుకున్నవారు దేశ ద్రోహులవుతారా.? దేశభక్తిపై ధ్రువీకరణ పత్రాలిచ్చేందుకు ఈ మూర్ఖులెవరు.? -కేటీఆర్​, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

అందుకే దేశ ద్రోహి అన్నారు..

రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు కేసీఆర్​ ఆర్థిక సాయం చేయడంపై భాజపా నేతలు మండిపడ్డారు. ఆయన దేశద్రోహిగా పేర్కొంటూ పలు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్​ ఆర్థిక సాయం

సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు శనివారం.. సీఎం కేసీఆర్​ అభినందనలు (CM KCR on Three Farms Law ) తెలిపారు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు. రైతులపై పెట్టిన కేసులను కేంద్రం ఎత్తివేయాలని(repeal of three farm laws) డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు తెలిపిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టారని... అమాయకులపై పెట్టిన దేశద్రోహం కేసులు ఎత్తివేయాలని స్పష్టం చేశారు. రైతుల విషయంలో కేంద్ర చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ క్రమంలో ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్​ ఆర్థిక సాయం ప్రకటించారు. రూ. 3లక్షల చొప్పున అందిస్తామని చెప్పారు. రైతులకు సాయం కోసం రూ. 22 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

'ఉద్యమ సమయంలో 700కు పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. అమరులైన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి. అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తాం. రైతులకు సాయం కోసం రూ.22 కోట్లు కేటాయిస్తాం. కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి.' కేసీఆర్, ముఖ్యమంత్రి

ఇదీ చదవండి:Congress Counter Attack: కాంగ్రెస్​ కౌంటర్​ రాజకీయం.. తెరాస, భాజపాలపై విమర్శల అటాక్​

ABOUT THE AUTHOR

...view details