తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR TWEET: 'ట్వీట్​ను సవరించుకున్న మంత్రి కేటీఆర్​.. కారణమిదే!' - Minister KTR latest news

సైదాబాద్​ బాలిక హత్య కేసు నిందితుడి గురించి చేసిన ట్వీట్​ను మంత్రి కేటీఆర్​ సవరించుకున్నారు. సమాచార లోపం వల్ల నిందితుడు పట్టుబడినట్లు ట్వీట్ చేశానని తెలిపారు. పొరపాటుపడి చేసిన ట్వీట్​ పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు.

KTR TWEET: 'ట్వీట్​ను సవరించుకున్న మంత్రి కేటీఆర్​.. కారణమిదే!'
KTR TWEET: 'ట్వీట్​ను సవరించుకున్న మంత్రి కేటీఆర్​.. కారణమిదే!'

By

Published : Sep 15, 2021, 4:54 AM IST

హైదరాబాద్ సైదాబాద్ పోలీస్​స్టేషన్ పరిధిలో ఆరేళ్ల బాలిక హత్యాచార నిందితుడు రాజు పట్టుబడ్డట్లు గతంలో తాను చేసిన ట్వీట్​ను మంత్రి కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. సమాచార లోపంతో నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసినట్లు పొరపాటున తాను చేసిన ప్రకటన పట్ల మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు.

నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నారని తెలిపారు. నిందితుడు త్వరగా అరెస్టై.. తగిన శిక్షపడటం ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరగాలని కోరుకుందామని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details