సీఎం కేసీఆర్కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్.. తెరాసపై విమర్శలు గుప్పించారు.
బండి సంజయ్ ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్ - ghmc elections 2020 news
చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. అవాస్తవ ఆరోపణలతో ఎన్నికల వేళ రాజకీయం చేయడం సబబు కాదన్నారు.
బండి సంజయ్ ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ వేళలో అసంబంధ, అవాస్తవ వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి కేటీఆర్ అన్నారు. బండి సంజయ్ చేస్తున్న అసత్య ప్రచారం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. ఇలాంటి అవాస్తవ ఆరోపణలతో ఎన్నికల వేళ రాజకీయం చేయడం సరికాదని మంత్రి హెచ్చరించారు.
ఇదీ చదవండిఃభాగ్యలక్ష్మీ ఆలయానికి బండి సంజయ్.. కేసీఆర్ వ్యాఖ్యలపై ఫైర్