క్రైస్తవుల సంక్షేమానికి, భద్రతకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ రాంకోఠిలో అధునాతనంగా నిర్మించిన సెంటనరీ వెస్లీ చర్చిని మంత్రి సందర్శించారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని క్రైస్తవ సోదరులకు శుభకాంక్షలు తెలిపారు. తెరాస ప్రభుత్వం కలకాలం కొనసాగాలని... తెలంగాణ మరింత ప్రగతి పథంలో ముందుకు సాగాలని... ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు.
'క్రైస్తవుల సంక్షేమానికి, భద్రతకు సీఎం కేసీఆర్ కృషి'
హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన సెంటనరీ వెస్లీ చర్చిని మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు.
'క్రైస్తవుల సంక్షేమానికి, భద్రతకు సీఎం కేసీఆర్ కృషి'
సెంటనరీ వెస్లీ చర్చిలో ఏకకాలంలో పది వేల మంది ప్రార్థనలు చేయోచ్చని మంత్రి ఈశ్వర్‌కు రెవరెండ్ యు.డానియేల్ వివరించారు. చర్చి నిర్మాణానికి 15కోట్ల రూపాయలు వెచ్చించామని, దీనిని పూర్తి చేసి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ సహాయం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కొప్పుల ఈ విషయం గురించి సీఎంకు వివరించి నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:గిఫ్ట్‌ల ఎర చూపి... ఆస్తులమ్ముకునేలా చేస్తారు...!