తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటుకు దీటుగా గురుకులాలు: మంత్రి కొప్పుల - తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్రంలో విద్యార్థులు జాతీయస్థాయి పరీక్షల్లో సత్తా చాటుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు నడుస్తున్నాయని మంత్రి స్పష్టం చేశాయి.

minister koppula eeshwar spoke on residential schools in telangana
'ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గురుకులాలు నడుస్తున్నాయి'

By

Published : Mar 11, 2020, 12:20 PM IST

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్స్ నడుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో ఒకేసారి 290 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని... మొత్తంగా 967 గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

గురుకుల పాఠశాలల్లోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థులు జాతీయస్థాయి పరీక్షలు, యూనివర్సిటీల్లో సత్తా చాటుతున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని వసతిగృహాల్లో పాటిస్తున్న మెనూ మరెక్కడా లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు.

'ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గురుకులాలు నడుస్తున్నాయి'

ఇవీ చూడండి: 'కంటివెలుగు ద్వారా 40 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశాం'

ABOUT THE AUTHOR

...view details