అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలో చూపించే ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. హైదరాబాద్ షేక్‌పేట ఎస్సీ గురుకుల పాఠశాలలో జరిగిన ఐక్యరాజ్యసమితి మోడల్ సదస్సు, మోడల్ పార్లమెంట్ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడు: కొప్పుల - koppula on cm kcr
ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడు: కొప్పుల
గురుకుల విద్యా సంస్థలు విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తున్నామన్న ఆయన.. అన్ని వర్గాల ప్రజలు ఉన్నత విద్యావంతులు కావాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ప్రారంభించారని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: 'పేదలు కూడా గొప్పగా బతకాలనేదే తెరాస ప్రభుత్వ లక్ష్యం'