ప్రధానమంత్రి ఏడేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా గర్భిణీలకు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పౌష్టికాహారాన్ని అందించారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 70 మందికి ఈ పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.
Kishan Reddy: గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ చేసిన కిషన్ రెడ్డి - Hyderabad latest news
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. గర్భిణీలకు మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పౌష్టికాహారం అందించారు. కరోనా కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Kishan ready distributed nutrition food
కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మహమ్మారి కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కర్ణాకర్, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.