ప్రశ్న: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203పై తెలంగాణ ప్రభుత్వానికున్న అభ్యంతరాలు ఏమిటి?
జవాబు: రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85(8) ప్రకారం ఏ రాష్ట్రమైన కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలంటే అపెక్స్ కమిటీ, కృష్ణా నదీజలాల బోర్డు అనుమతి తీసుకోవాలి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ నీటి తరలింపునకు రాత్రికి రాత్రే జీవో విడుదల చేసింది. ఇది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది.
ప్రశ్న: తమకు కేటాయించిన ప్రకారమే నీటిని తీసుకుంటున్నామనే ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై మీ అభిప్రాయం?
జవాబు: నీటి కేటాయింపుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి. అదే విధంగా నాగరార్జున సాగర్‌కు ఆధారమైన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలిస్తే తెలంగాణకు నీరెట్లా వస్తుంది. దీనివల్ల హైదరాబాద్‌లో తాగునీటి సమస్య తలెత్తుతుంది. పలు సాగునీటి ప్రాజెక్టులకు నీటి ఎద్దడి వస్తుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను నీరందని పరిస్థితి రావొచ్చు.