తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2021, 9:57 PM IST

ETV Bharat / state

Harish rao letter to central: 'రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించండి'

harish rao letter to central : వ్యాక్సిన్​ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు కేంద్రానికి లేఖ రాశారు. గతంలో మాదిరిగా డోసుల మధ్య వ్యవధిని నాలుగు నుంచి ఆరు వారాలకు తగ్గించాలని కోరారు.

harish rao letter to central
harish rao letter to central

Harish rao letter to central : కొవిషీల్డ్​ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఈ మేరకు వ్యాక్సిన్​ మధ్య కాల వ్యవధిని తగ్గించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం రెండు డోసుల మధ్య 12 వారాల గడువు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే 4 నుంచి 6 వారాలకు సెకండ్ డోస్ వ్యవధిని కుదించాలని లేఖలో పేర్కొన్నారు. 12 వారాల గడువు నేపథ్యంలో రెండో డోస్ ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు.

covishield vaccine: వలస కూలీలు మొదటి డోసు తీసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని.. మొదటి డోసు వివరాలు ఆన్​లైన్​లో పొందుపరచినప్పటికీ వాటి వివరాలు ఆయా రాష్ట్రాలకు పరిమితం అవుతున్నాయని వివరించారు. ఫలితంగా రెండో డోసు సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఫ్రంట్ లైన్ వారియర్​లు, హై రిస్క్ గ్రూప్, హెల్త్ కేర్ సిబ్బంది వ్యాక్సిన్ తీసుకుని ఇప్పటికే దాదాపు 8 నుంచి 10 నెలలు అవుతున్న నేపథ్యంలో ఆయా విభాగాల వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో బూస్టర్ డోస్ గురించి ఆలోచించాలని సూచించారు.

ఇదీ చూడండి:KTR Tweet to PM: ప్రధానికి కేటీఆర్​ ట్వీట్​.. జాతీయహోదా ఇవ్వాలని విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details