తెలంగాణ

telangana

ETV Bharat / state

50వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు: హరీశ్​రావు - Minister Harish Rao latest news

రాష్ట్రప్రభుత్వం 50వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు నిర్ణయించిందని ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు సైతం సీఎం చర్యలు తీసుకున్నారని తెలిపారు.

harish rao
50వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు: హరీశ్​రావు

By

Published : Jan 5, 2021, 6:00 PM IST

50వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు: హరీశ్​రావు

నెలాఖరులోగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి.. ఉద్యోగ ఖాళీల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరలో 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కానుండటంతో పాటు.. ప్రైవేట్ కంపెనీల్లోనూ ఉద్యోగాల కల్పన జరుగుతుందని వెల్లడించారు.

దేశంలో నిరుద్యోగిత రేటు కన్నా తెలంగాణలో తక్కువగా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనపై నమ్మకం.. రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నందున భారీగా పెట్టుబడులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ భవన్​లో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించిన హరీష్ రావు... తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు. టీఎస్​ ఐపాస్ ద్వారా భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్న మంత్రి.... ఆరున్నరేళ్ల కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15లక్షల ఉద్యోగావకాశాలు కల్పించామని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details