తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ ఆన్​లైన్ అధ్యాపకులకు సర్టిఫికెట్ల పంపిణీ - Telangana News Updates

ఉత్తమ ఆన్​లైన్ అధ్యాపకులకు మంత్రి​ హరీశ్​రావు సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన ప్రభుత్వ ప్రైవేటు అధ్యాపకులు 26 మందికి ఉత్తమ ఆన్​లైన్ అధ్యాపకులుగా సర్టిఫికెట్లను అందజేశారు.

minister
ఉత్తమ ఆన్​లైన్ అధ్యాపకులకు మంత్రి​ సర్టిఫికెట్ల పంపిణీ

By

Published : Jan 13, 2021, 9:09 PM IST

కరోనా విపత్కర పరిస్థితి నేపథ్యంలో భవిష్యత్తులో ఆన్​లైన్ ద్వారా విద్యార్థులకు బోధన అందించాలని మంత్రి హరీశ్​రావు తెలిపారు. సికింద్రాబాద్​లోని లయన్స్​ క్లబ్​లో లయన్స్​ అడాప్ట్​ స్కూల్స్​లో ఆన్​లైన్​ ద్వారా ఉత్తమంగా బోధించిన అధ్యాపకులను మంత్రి హరీశ్​రావు అభినందించి... వారికి ధ్రువపత్రాలను పంపిణీ చేశారు.

తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన ప్రభుత్వ ప్రైవేటు అధ్యాపకులు 26 మందికి ఉత్తమ ఆన్​లైన్ అధ్యాపకులుగా సర్టిఫికెట్లను అందజేశారు. కరోనా సమయంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఆన్​లైన్​ ద్వారాబోధించడం... వారికి లయన్స్ క్లబ్​ అడంగా నిలవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

మహబూబాబాద్​కు చెందిన మహమ్మద్​ నబీ ఉత్తమ ఆన్​లైన్​ ఉపాధ్యాయుడిగా 25వేల బహుమతిని హరీశ్​రావు చేతుల మీదుగా అందుకున్నారు. కరోనా విపత్కర సమయంలో విద్యార్థులకు ఆన్​లైన్​ ద్వారా పాఠాలను బోధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు... సామాజిక విలువలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యత వంటి అంశాలను కూడా వారికి నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థి దశ అనేది చాలా కీలకమని.. ఆ దశలో విద్యార్థులు చెడు దారి పట్టకుండా వారికి సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details