MINISTER GANGULA KAMALAKAR: రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని, మిల్లింగ్ పరిశ్ర మనుగడనూ పరిగణనలోకి తీసుకుంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేంద్రానికి ఇవేమీ పట్టడం లేదని వ్యాఖ్యానించారు. మిల్లర్ల సంఘాల ప్రతినిధులతో గంగుల సమావేశమయ్యారు.
తరుగు పేరుతో రైతుల నుంచి అదనంగా ధాన్యం దించుకోవద్దని మిల్లర్లకు మంత్రి గంగుల తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు తరలించి మిల్లుల్లో దించుకోవాలన్నారు.మిల్లింగ్ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అందుకోసం ఉన్నతాధికారులతో కమిటీ వేసినట్లు గుర్తుచేశారు.