తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంత మందికి కరోనా సోకినా చికిత్స అందించడానికి సిద్ధం: మంత్రి ఈటల - తెలంగాణ అసెంబ్లీ వర్షకాలం సమావేశాలు 2020

కరోనా కట్టడికై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల పేర్కొన్నారు. ఎప్పటికప్పడు సీఎం కేసీఆర్​ కొవిడ్​పై దిశానిర్దేశాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ లాబ్​లు, ప్రాథమిక ఆసుపత్రులు సహా 38 ప్రైవేటు లాబొరేటరీల సాయంతో పరీక్షలు చేస్తున్నామన్నారు. హోం ఐసోలేషన్​కు ప్రత్యామ్నాయంగా 121 ఐసోలేషన్​ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైరస్​ చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.

minister etela spoke about the covid precautions taken in the telangana state
ఎంత మందికి కరోన సోకినా చికిత్స అందించడానికి సిద్ధం: మంత్రి ఈటల

By

Published : Sep 10, 2020, 1:07 PM IST

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు 10.3 లక్షల పీపీఈ కిట్లు, 18.50 లక్షల ఎన్​-95 మాస్కులు, 24 వేలకుపైగా రెమిడీస్వేర్​ ఇంజిక్షన్లు అందించామని మంత్రి ఈటల పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్​ బెడ్లను అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచామని.. గాంధీ ఆసుపత్రిలో 1000 ఆక్సిజన్​ బెడ్లు,500 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 1224 పడకల సామర్థ్యంతో అన్ని వసతులు, సౌకర్యాలతో తెలంగాణ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ను నూతనంగా ఏర్పాటు చేసి కొవిడ్​ రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ఎంత మందికి కరోన సోకినా చికిత్స అందించడానికి సిద్ధం: మంత్రి ఈటల

మహమ్మారి బారినపడిన దాదాపు 80 శాతం మంది ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఉండడం లేదని అలాంటి వారికి హోం ఐసోలేషన్​ ఇచ్చి వారికి అవసరమైన కిట్లను ప్రభుత్వమే అందిస్తోందని ఈటల పేర్కొన్నారు. హోం ఐసోలేషన్​కు ప్రత్యామ్నాయంగా 121 ఐసోలేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనాపై ప్రజల్లో అవగాహన ఏర్పడిందన్నారు. ఎంతమందికి కరోనా సోకినా సరే వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

ఇవీ చూడండి:రఫేల్​ జెట్ల​ విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details