అంతర్జాతీయ, డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించే వారి సౌకర్యార్థం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల ప్రారంభించారు. కరోనా నిబంధనల్లో భాగంగా 96 గంటలలోపు నెగిటివ్ వచ్చిన ఆర్టీపీసీఆర్ రిపోర్టు ఉన్నప్పుడు మాత్రమే విమాన ప్రయాణాలు చేసేందుకు అనుమతులు ఉన్నాయి.
అలా రిపోర్టు లేకుండా ఇతర దేశాలు లేక రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో వారం రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు సైతం రిపోర్టు తప్పనిసరిగా ఎయిర్ పోర్టులో చూపాల్సి ఉన్నందున మ్యాప్ మై జీనోమ్ సంస్థతో కలిసి జీఎంఆర్ ప్రతినిధులు ఈ ల్యాబ్‌ని ఏర్పాటు చేశారు. దీంతో విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌లోనే తమ టెస్టులు చేయించుకోవచ్చు.