రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎయిర్ కండిషనర్ల పనితీరును లైవ్ డెమో ద్వారా తెలుసుకునేందుకు వీలుగా నూతన ఎయిర్ కండిషనర్ షోరూంను ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ బాలాజీ కూల్ కేర్ షోరూంను ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రాష్ట్రంలోనే ప్రథమంగా లైవ్ డెమో చూపించే షోరూమ్‌గా ఇది నిలుస్తుందని మంత్రి అన్నారు.
ఎయిర్ కండిషనర్ల షోరూం ప్రారంభించిన మంత్రి ఈటల - minister eetela rajendar
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఎయిర్ కండిషనర్ల షోరూంను మంత్రి ఈటల ప్రారంభించారు. రాష్ట్రంలోనే ప్రథమంగా లైవ్ డెమో చూపించే షోరూమ్‌గా ఇది నిలుస్తుందని మంత్రి అన్నారు.
ఎయిర్ కండిషనర్ల షోరూం ప్రారంభించిన మంత్రి ఈటల
వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా డెమో ఏర్పాట్లు చేసినట్లు సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్ తెలిపారు. నాణ్యమైన, మన్నిక గల ఎయిర్ కండిషనర్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ లైవ్ డెమో ద్వారా మంచి ఎయిర్ కండిషనర్లను ఎంచుకోవచ్చన్నారు.
ఇవీ చూడండి: 'ముంపు బాధితులకు ఆర్థికసాయాన్ని వేగవంతం చేయండి'