తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంత వాహనాల్లో గ్రామాలకు వెళితే అనుమతిస్తాం: ఈటల - corona latest news

కరోనా వైరస్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా నిన్న చేపట్టిన జనతా కర్ఫ్యూను ప్రజలు విజయవంతం చేశారని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జనతా కర్ఫ్యూలో చూపిన స్ఫూర్తిని జనం ఈ రోజు చూపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

minister-eetala-on-corona
సొంత వాహనాల్లో ఇంటికెళితే అనుమతిస్తాం: ఈటల

By

Published : Mar 23, 2020, 4:16 PM IST

Updated : Mar 23, 2020, 4:29 PM IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని లాక్‌డౌన్‌ ప్రకటిస్తే.. కొందరు మాత్రం ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా బయటకు వస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. "ప్రాణాలు ముఖ్యమా? వైరస్‌ బారినుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం ముఖ్యమా? లేకపోతే ఈ క్షణం బయటకు పోయి పనిచేసుకోవడం ముఖ్యమా?" అనేది ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు.

ప్రభుత్వం రూ. 2400 కోట్ల ఆర్థికభారం మోస్తూ ప్రజలకు బియ్యం, నగదు సాయం చేస్తోందన్నారు. సాధారణ ఓపీలు, అత్యవసరం కాని చికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లొద్దని కోరారు. ఈ పది రోజులు చాలా కీలక సమయమని.. ఓపికతో ఉంటే దీన్ని తరిమికొట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. సొంత వాహనాల్లో గ్రామాలకు వెళ్లే వారికి అవకాశం ఇస్తామని ఈటల చెప్పారు.

నిత్యవసరాలు అందుబాటులోనే..

నిత్యావసరాల దుకాణాలు మూతపడవని మంత్రి భరోనా ఇచ్చారు. ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటికి వచ్చి సరుకులు తీసుకుని వెంటనే వెళ్లిపోవాలని కోరారు. కరోనా పరిస్థితి విషమిస్తే బాధితుల కోసం ప్రైవేటు ఆస్పత్రులను వినియోగించుకుంటామన్నారు.

ఇవీ చూడండి:తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్

Last Updated : Mar 23, 2020, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details