చర్చలు సఫలం.. ఆ ఐదు డిమాండ్లకు మంత్రి సానుకూలం - minister eetala met with junior doctors in gandhi hospital
17:03 June 10
చర్చలు సఫలం.. ఆ ఐదు డిమాండ్లకు మంత్రి సానుకూలం
గాంధీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యులతో మంత్రి ఈటల జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జూనియర్ వైద్యుల డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. గాంధీ ఆస్పత్రి జూడాలు ఆందోళన విరమించి విధుల్లో చేరనున్నారు. ప్రధానంగా ఐదు డిమాండ్లు మంత్రి దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
కొవిడ్ రోగులకు గాంధీతోపాటు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. కొత్తగా వైద్యులను నియమించాలని వైద్యులు కోరుతున్నారు. పీజీ పూర్తవుతున్న జూడాలను సీనియర్ రెసిడెంట్స్‌గా తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం చేశారు. వైద్యులపై దాడి చేస్తే విధించే శిక్షల విషయమై ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
TAGGED:
minister eetala