దుబాయ్ వేదికగా జరిగిన భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపై సోషల్ మీడియాలో మహమ్మద్ షమీని (Asaduddin Owasi) లక్ష్యంగా చేసుకుంటున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇది ముస్లింలపై ఉన్న విద్వేషం, రాడికలైజేషన్‌ను తెలియజేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా క్రికెట్లో గెలుపు, ఓటములు ఉంటాయని గుర్తు చేశారు. క్రికెట్ టీంలో 11 మంది ఉంటారు... కానీ, ముస్లిం ప్లేయర్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని తప్పుపట్టారు.
ఈ అంశాన్ని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ఖండిస్తుందా? అని ప్రశ్నించారు. అతిపెద్ద దేశం చైనాలో 200 కోట్ల వ్యాక్సిన్లు సెప్టెంబర్‌లో ఇచ్చారని అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owasi) అన్నారు. భారత్‌లో 100 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు... డబుల్ డోస్ తీసుకున్న వారు ఎంత మంది? కేవలం 31 శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. 2021 డిసెంబర్ నాటికి మొత్తం భారతీయులందరికీ రెండు డోసుల వ్యాక్సీన్ అందుతుందని ప్రధాని అంటున్నారని, ఇది తప్పని సమాచార, ప్రసార శాఖ మంత్రి స్పష్టం చేశారని తెలిపారు. మిగిలిన రెండు మాసాల్లో అందరికీ ఇవ్వటం వీలుకాదని, కొవిడ్ టీకా రెండు డోసులు భారతీయులందరికీ అందాలంటే మార్చి, ఏప్రిల్ అవుతుందని చెప్పారు.