బెంగళూరు నుంచి వలస కార్మికులు తమ సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు సైకిళ్లపై పయనమయ్యారు. ఈనెల తొమ్మిదో తేదిన సైకిల్ కొనుగోలు చేసి బయలుదేరిన వీరు నేడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ ముగ్గురు టైల్స్ కార్మికులని... లాక్డౌన్ వల్ల పనిలేక సొంత గ్రామాలకి వెళ్తున్నామని తెలిపారు. గంటకు పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలుపెరుగని ప్రయాణం... సైకిల్‌పై పోరాటం - సైకిల్‌పై వెళ్తున్న వలస కార్మికులు
లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పొరుగు రాష్ట్రాల్లో ఉండలేక, చేయడానికి పనిలేక సొంత గ్రామాలకు తరలిపోతున్నారు.
అలుపెరుగని ప్రయాణం... సైకిల్‌పై పోరాటం