స్వస్థలాలకు వెళ్లేందుకు పాట్లు... ప్రయాణంలో కునుకుపాట్లు - migrants problems
లాక్డౌన్ వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలసకూలీలకు సడలింపులు ఏ మాత్రం ఉపశమనం ఇవ్వలేకపోతున్నాయి. స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వగా... వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్న ప్రభుత్వాల మాటలు గాలికే వెళ్తుండగా.... వలస కూలీలు మాత్రం ప్రమాదకర ప్రయాణాలు చేస్తూ ప్రాణాలు గాలికొదిలేస్తున్నారు.
స్వస్థలాలకు వెళ్లేందుకు పాట్లు... ప్రయాణంలో కునుకుపాట్లు
లాక్డౌన్ కారణంగా వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నడలింపులతో రాత్రనకా పగలనకా... వాహనాల కోసం పడిగాపులు పడుతున్నారు. ఏ రకంగానైనా స్వస్థలాలకు పోవాలన్న తపనతో... చివరికి లారీల క్యాబిన్ల మీద కూర్చొని మరీ వెళ్తున్నారు. ఈ క్రమంలో కడుపు నిండా తిండిలేక.. కంటి నిండా నిద్రలేక కునుకు పాట్లు పడతూ... ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు వలస కూలీలు.